Bonda Uma: సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం: బోండా ఉమ

  • రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఆదా కాలేదు
  • రియలెస్టేట్ కోసమే విశాఖ రాజధాని
  • 7 లక్షల మందికి పెన్షన్లను తొలగించారు

ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బోండా ఉమ విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా కోట్లాది రూపాయలు ఆదా అయ్యాయంటూ ప్రభుత్వం చెబుతున్నదంతా వాస్తవం కాదని ఆయన అన్నారు. రివర్స్ టెండరింగ్ తో ఒక్క రూపాయి కూడా ఆదా కాలేదని చెప్పారు. కాంట్రాక్టర్లకు మేలు చేసేలా జగన్ పాలన ఉందని విమర్శించారు. కేవలం రియలెస్టేట్ వ్యాపారం కోసమే విశాఖను రాజధాని చేస్తానంటున్నారని విమర్శించారు.

టీడీపీ హయాంలో 54 లక్షల మందికి పైగా పెన్షన్లు ఇచ్చామని... జగన్ సీఎం అయిన తర్వాత అకారణంగా 7 లక్షల మందికి పెన్షన్లను తొలగించారని ఉమ మండిపడ్డారు. పేదల కడుపును జగన్ కొడుతున్నారని అన్నారు. పెన్షన్ల తొలగింపును నిరసిస్తూ సోమవారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చెప్పారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పిన జగన్... ఇప్పుడు అష్ట వంకర్లు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News