భారీ స్కోరు సాధించిన టీమిండియా... న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభం

05-02-2020 Wed 12:34
  • 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు సాధించిన టీమిండియా
  • శతకంతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్
  • 7 ఓవర్లలో 43 పరుగులు చేసిన కివీస్

హామిల్టన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ధాటికి స్కోరు బోర్డు దూసుకుపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ మెన్ లలో శ్రేయస్ అయ్యర్ 103, కేఎల్ రాహుల్ 88, విరాట్ కోహ్లీ 51, మయాంక్ అగర్వాల్ 32, జాధవ్ 26, పృథ్వీ షా 20 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్, జాధవ్ నాటౌట్ గా నిలిచారు.

మరోవైపు 348 పరుగుల విజయలక్ష్యంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం కివీస్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. న్యూజిలాండ్ విజయం సాధించాలంటే 43 ఓవర్లలో 305 పరుగులు (7.09 రన్ రేట్ తో)  సాధించాల్సి ఉంది.