ట్రంప్'రితనంకి ఝలక్ ఇచ్చిన స్పీకర్.. వీడియో వైరల్!

05-02-2020 Wed 12:22
  • కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి ట్రంప్ వార్షిక ప్రసంగం 
  • ట్రంప్ చర్యకు నొచ్చుకుని ప్రసంగ పత్రాలను చించేసిన స్పీకర్
  • బయటపడ్డ ట్రంప్, నాన్సీ విభేదాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ కరచాలనం చేయాలని చేతిని చూపితే ఆమెకు షేక్ హ్యాండ్‌ ఇవ్వకుండానే ఆయన వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి వార్షిక ప్రసంగం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రంప్ కరచాలనం చేయకపోవడంతో నొచ్చుకున్న స్పీకర్‌ ఆ తర్వాత ట్రంప్‌ ప్రసంగ పత్రాలను చించేశారు.
               
 ట్రంప్‌ ప్రసంగం ముగుస్తుందనగా సభలోని సభ్యులు కరతాళ ధ్వనులు చేయగా, నాన్సీ  మాత్రం ఇలా ట్రంప్‌ ప్రసంగ పత్రాలను చించేశారు. ట్రంప్ షేక్ హ్యాండ్‌ ఇవ్వనందుకు ప్రతిఫలంగా తాను చేసిన మర్యాదపూర్వకమైన పని ఇదని ఆమె ఆ తర్వాత విలేకరులతో అన్నారు. గతేడాది ఉభయసభలను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగం సందర్భంగా కూడా ట్రంప్, నాన్సీ మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. అప్పట్లో నాన్సీ  ట్రంప్ ప్రసంగానికి వెటకారంగా చప్పట్లు కొట్టారు.