టెండర్ ప్రాసెస్ కంటే ముందు న్యాయమూర్తి దగ్గరకు వెళ్తుంది: సీఎం జగన్

05-02-2020 Wed 12:02
  • పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు చర్యలు
  • కాంట్రాక్టుల టెండర్లలో మార్పులు చేయాలంటే కీలక ప్రక్రియ
  • న్యాయమూర్తి అనుమతి తీసుకుంటాం 
  • టెండర్ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం 

పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విజయవాడలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... కాంట్రాక్టులకు సంబంధించిన టెండర్లలో ఎలాంటి మార్పులు చేయాలన్నా న్యాయమూర్తి అనుమతి తీసుకుంటాం. ఒక టెండర్ ప్రాసెస్ కంటే ముందు న్యాయమూర్తి దగ్గరకు వెళ్తుంది' అని చెప్పారు.

'ఏడు రోజులపాటు టెండర్ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటాం. కాంట్రాక్టులకు సంబంధించి టెండర్లలో ఎలాంటి మార్పులైనా న్యాయమూర్తికి సూచించవచ్చు. జ్యుడిషియల్ ప్రివ్యూయాక్ట్‌ ద్వారా టెండర్లు పిలుస్తున్నాం' అని జగన్ వెల్లడించారు.