night duty: మీరు నైట్ డ్యూటీలు చేస్తారా?.. అయితే ఇది మీకోసమే!

  • వారానికో రకమైన షిప్టులో పనిచేసే వారిలోనూ సమస్యలు
  • నిద్రలేమి కారణంగా గతి తప్పే జీవగడియారం
  • హృద్రోగ సమస్యలు, షుగర్, బీపీ వచ్చే అవకాశం

నైట్ డ్యూటీలు చేసే వారికి ఇది హెచ్చరికే. రాత్రి వేళ విధులు నిర్వర్తించేవారితోపాటు, వారానికోరకమైన షిఫ్ట్‌లో పనిచేసే వారిలో జీవగడియారం గాడి తప్పి గుండె సమస్యలు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టారో వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

ఇలాంటి షిఫ్టుల్లో పనిచేసేవారిలో నిద్రలేమి కారణంగా జీవగడియారం గతి తప్పుతుందని, ఫలితంగా జీవక్రియలు మందగిస్తాయని తేలింది. ముఖ్యంగా బీపీ, షుగర్ పెరగడంతోపాటు పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది. ఈ విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే హృద్రోగాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాబట్టి సరైన నిద్రతోపాటు ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

More Telugu News