Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • 'జాను' రన్ టైమ్ రెండున్నర గంటలు 
  • బాలకృష్ణ సినిమాలో శ్రియ 
  • 'రొమాంటిక్'కి రామ్ వాయిస్ ఓవర్ 
  • అనుష్క 'నిశ్శబ్దం' రిలీజ్ డేట్      

 *  శర్వానంద్, సమంత జంటగా దిల్ రాజు నిర్మించిన 'జాను' చిత్రం సెన్సార్ నుంచి క్లీన్ U సర్టిఫికేట్ ను పొందింది. దీని రన్ టైమ్ (ప్రదర్శన కాలం) రెండు గంటల ముప్పై నిమిషాలుగా నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీన విడుదలవుతున్న ఈ చిత్రానికి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు.
*  నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందే చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 15 నుంచి జరుగుతుంది. కాగా, ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు కథానాయిక శ్రియను తీసుకున్నట్టు తెలుస్తోంది.
*  పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా 'రొమాంటిక్' పేరిట ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హీరో రామ్ వాయిస్ ఓవర్ చెబుతున్నట్టు తాజా సమాచారం.
*  అనుష్క ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'నిశ్శబ్దం' చిత్రం గత నెలలో విడుదల కావలసి వుండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయడానికి నిర్ణయించారట.

More Telugu News