BJP: సీఏఏ అల్లర్ల వెనక రాజకీయ వ్యూహాలున్నాయి: ప్రధాని మోదీ

  • భారత్ ను విడగొట్టడానికి కుట్ర జరుగుతోంది
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని
  • బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా దేశంలో కొనసాగుతోన్న అల్లర్లపై రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ  ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు.  బీజేపీ అభ్యర్థి ప్రద్యుమ్న రాజ్ పుత్ బరిలో ఉన్న ద్వారక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ.. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిచారు.  దేశంలోని మత సామరస్యాన్ని దెబ్బతీయడమే ఈ రాజకీయ వ్యూహాల ప్రధాన ఉద్దేశాలన్నారు.

ఈ దశాబ్దంలో జరుగుతున్న తొలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అతి ముఖ్యమైనవంటూ.. ఈ రోజు ఓటర్లు తీసుకునే నిర్ణయంపై దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందన్నారు. ‘సీలంపూర్, జామియా, షహీన్ బాగ్ కానీయండి. కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కొన్నిరోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్న నిరసనలు కావు. ఇది ఒక ఎక్స్ పర్ మెంట్’ అని మోదీ వ్యాఖ్యానించారు.

జామియా, షహీన్ బాగ్ తదితర ప్రాంతాల్లో నిరసనల వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ.. భారత్ ను విడగొట్టడానికి కుట్ర జరుగుతోందని చెప్పారు. తూర్పు ఢిల్లీ, ద్వారక సభలతోనే గెలిచేదెవరో తేలిపోయిందన్నారు. ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే వ్యవధి ఉండటం.. బీజేపీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో కొందరికి నిద్ర కూడా పట్టడం లేదని మోదీ విపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

More Telugu News