Sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

  • చైనా మార్కెట్లు లాభపడటంతో బలపడ్డ ఇన్వెస్టర్ల సెంటిమెంట్
  • 917 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 272 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు లాభాల్లోనే పయనించాయి. కరోనా వైరస్ దెబ్బకు కుదేలైన చైనా మార్కెట్లు ఈరోజు అర శాతం లాభపడటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతోపాటు క్రూడ్ ఆయిల్ ధరలు కొంత మేర తగ్గడంతో మార్కెట్లలో జోష్ కనిపించింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 917 పాయింట్లు ఎగబాకి 40,789కి చేరుకుంది. నిఫ్టీ 272 పాయింట్లు లాభపడి 11,979కి పెరిగింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ కంపెనీ (7.42%), బజాజ్ ఫైనాన్స్ (3.94%), ఐటీసీ లిమిటెడ్ (3.88%), టాటా స్టీల్ (3.70%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.59%).

టాప్ లూజర్స్:
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం బజాజ్ ఆటో (-3.92%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.80%) మాత్రమే నష్టాల్లో ముగిశాయి.

More Telugu News