Andhra Pradesh: రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉంది!: కేంద్రం స్పష్టీకరణ

  • పార్లమెంటులో ప్రశ్నించిన గల్లా జయదేవ్
  • లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర సహాయమంత్రి నిత్యానందరాయ్
  • మూడు రాజధానుల అంశం మీడియా ద్వారానే తెలిసిందన్న మంత్రి

ఏపీ రాజధానిపై అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. అమరావతి సహా విశాఖపట్నం, కర్నూలును కూడా రాజధానులుగా వైసీపీ ప్రభుత్వం పేర్కొనడంతో నిరసన జ్వాలలు రేగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో రాజధాని గురించి ప్రశ్నించారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ స్పష్టత ఇచ్చారు.

 ఏపీలో మూడు రాజధానుల అంశం తమకు మీడియా కథనాల ద్వారానే తెలిసిందని వెల్లడించారు. అయితే రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్న రాష్ట్రం ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని, రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉందని నిత్యానంద రాయ్ తన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. అయితే, గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసిందని, దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వచ్చాయని తెలిపారు.

More Telugu News