health: శాకాహారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన పరిశోధకులు.. హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువని వివరణ

  • తేల్చిన అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు
  • పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తింటే బెస్ట్ 
  • మాంసాహారంలో అమైనో యాసిడ్ల మోతాదు అధికం
  • గుండె పనితీరు, ఇతర క్రియలపై ప్రభావం 

మాంసాహారం తినకపోవడంతో కొన్ని పోషక పదార్థాలు తమకు అందకుండా పోతున్నాయని బాధపడే వారికి  అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు ఓ చల్లని వార్త చెప్పారు. శాకాహారులకు హృద్రోగాలు వచ్చే ముప్పు తక్కువగా ఉన్నట్లు తేల్చారు. మాంసాహారం తినకుండా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తినేవారికి ఈ ముప్పు తగ్గుతుందని తేల్చినట్లు చెప్పారు.

వీటిలో ‘సల్ఫర్‌ అమైనో యాసిడ్‌’ మోతాదు చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. అయితే, ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం, డెయిరీ ఉత్పత్తులు, సోయాబీన్‌ వంటి వాటిలో అమైనో యాసిడ్ల మోతాదు కూడా అధికమని వివరించారు. దీంతో గుండె పనితీరు, ఇతర క్రియలను ప్రభావితం చేస్తాయని తెలిపారు.

More Telugu News