kolkata: విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది!

  • దోహా నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణిస్తోన్న మహిళ
  • కోల్‌కతా విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్
  • తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించిన సిబ్బంది

ఓ మహిళ (23) విమానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. థాయిలాండ్‌కు చెందిన ఆమె నిండు గర్భిణి అయినప్పటికీ ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ విమానం క్యూఆర్ 830లో దోహా నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణం చేస్తోంది.

విమానం ప్రయాణిస్తుండగా ఆమెకు పురిటినొప్పులు వచ్చి, బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ విమానాన్ని కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించడానికి అధికారులను పైలట్ అనుమతి కోరాడు.

వెంటనే ఆ విమానం దిగడానికి కోల్ కతా ఏటీసీ అనుమతి ఇచ్చింది. దీంతో కోల్‌కతా విమానాశ్రయంలో ఆ విమానాన్ని పైలట్ దించాడు. అక్కడి నుంచి అంబులెన్సులో ఆమెను ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

More Telugu News