Corona Virus: ప్రపంచ దేశాలపై కరోనా కాటు... చైనా వెలుపల రెండో వ్యక్తి దుర్మరణం

  • మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా వైరస్
  • హాంకాంగ్ లో 39 ఏళ్ల వ్యక్తి మృతి
  • జనవరి 23న చైనా నుంచి వచ్చిన మృతుడు

చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ 20 దేశాలకు పాకింది. చాలా దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో ఇప్పటికే దాదాపు 450 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. చైనా వెలుపల ఫిలిప్పీన్స్ లో తొలి మరణం నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా హాంకాంగ్ లో ఓ వ్యక్తి మృతి చెందాడు.

39 ఏళ్ల వయసున్న ఓ వక్తి గత నెలలో చైనాలోని వూహాన్ కు వెళ్లాడు. జనవరి 23న హాంకాంగ్ కు తిరిగొచ్చాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్ లో మరో 15 కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది.

More Telugu News