Rajasri: ఒకే కథను మూడు భాషల్లో తీశారు .. నేనే హీరోయిన్: రాజశ్రీ

  • నా అసలు పేరు కుసుమకుమారి
  • 5 భాషల్లో 300 సినిమాలకి పైగా చేశాను
  • ఆ సినిమాను మరిచిపోలేనన్న రాజశ్రీ

తెలుగు తెరపై మెరిసిన అలనాటి అందాల కథానాయికల జాబితాలో రాజశ్రీ పేరు కూడా కనిపిస్తుంది. దాదాపు ఐదు భాషల్లో ఆమె 300లకి పైగా సినిమాలు చేశారు. తెలుగులో కాంతారావు సరసన ఆమె ఎక్కువ సినిమాలు చేశారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, "నా అసలు పేరు కుసుమకుమారి .. తెలుగు సినిమా కోసం రాజశ్రీ గా మార్చారు .. మలయాళంలో 'గ్రేసీ'గా మార్చారు.

తమిళంలో కథానాయికగా నేను చేసిన 'కాదలిక్క నేరమిల్లై' అనే సినిమా అక్కడ నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమాను హిందీలో చేస్తూ నన్నే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక తెలుగులోనూ ఆ కథను 'ప్రేమించి చూడు' పేరుతో తీశారు. ఇలా ఒకే కథను మూడు భాషల్లో తీయగా .. కథానాయికగా నన్నే తీసుకోవడం విశేషం. ఈ మూడు భాషల్లోను ఈ సినిమా విజయవంతం కావడం మరో విశేషం. అలా ఈ సినిమా నా కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News