PVP: ఆంధ్రులారా... చంద్రగ్రహణం కావాలా? జగన్మోహనం కావాలా?: పీవీపీ

  • పెన్షన్ ను ఇంటికే పంపుతున్న జగన్
  • ఉద్యోగులను నిరుద్యోగులను చేసిన గత ప్రభుత్వం
  • మీరే ఎంచుకోండి అన్న పీవీపీ 

వృద్ధులకు పెన్షన్ ను ఇంటికి పంపిస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వమేనని చెబుతూ, గత ప్రభుత్వం ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చి ఇంటికి పంపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత 'పీవీపీ' వరప్రసాద్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "పెన్షన్ ఇంటికి పంపించే ప్రభుత్వం ఒకటి, ఉద్యోగులను నిరుద్యోగులను చేసి ఇంటికి పంపే ప్రభుత్వం ఇంకొకటి ! మీరే ఛూజ్ చేసుకోండి ఆంధ్రులారా, చంద్రగ్రహణమా? లేక జగన్మోహనమా?" అని ఆయన ప్రశ్నించారు.

More Telugu News