Etela Rajender: ఇప్పటి వరకూ తెలంగాణలో ‘కరోనా’ లేదు: మంత్రి ఈటల

  • ‘కరోనా’ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టాం
  • గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ’కరోనా’ పరీక్షలు: ఈటల
  • గాంధీలో వైరాలజీ ల్యాబ్ 24 గంటలూ పని చేస్తుంది: డాక్టర్ నాగమణి

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఈ వైరస్ వ్యాపించలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ‘కరోనా’ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

‘కరోనా’ డేంజరస్ వైరస్: డాక్టర్ నాగమణి 

ఇప్పటికే ‘కరోనా’ శాంపిల్ టెస్టులు పూర్తి చేశామని గాంధీ ఆసుపత్రి డాక్టర్ నాగమణి తెలిపారు. ‘కరోనా’ డేంజరస్ వైరస్ అని, టెస్టింగ్ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇరవై నాలుగు గంటలూ కరోనా వైరాలజీ ల్యాబ్ పనిచేస్తుందని చెప్పారు.

కాగా, నేటి నుంచి గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా’ పరీక్షలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లో ఇప్పటి వరకూ 20 ‘కరోనా’ అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇందులో 19 మందికి ‘కరోనా’ నెగెటివ్ గా నిర్ధారించారు. ఇంకా ఒకరి రిపోర్ట్ రావాల్సి ఉంది.

More Telugu News