చైనాలో కుర్రాళ్లను ఆకర్షించడానికి గాళ్ ఫ్రెండ్ సౌకర్యం కల్పించిన షాపింగ్ మాల్

03-02-2020 Mon 20:41
  • రూ.10 చెల్లిస్తే షాపింగ్ లో తోడుగా అమ్మాయి
  • కేవలం 20 నిమిషాల వరకే అనుమతి
  • షాపింగ్ మాల్ కొత్త ఎత్తుగడ
చైనాలోని హ్యువాన్ నగరంలో ఓ షాపింగ్ మాల్ తన అమ్మకాలు పెంచుకునేందుకు వినూత్నమైన ఎత్తుగడ వేసింది. పక్కన అమ్మాయి ఉంటే కుర్రాళ్లు ఎంత జోరుగా షాపింగ్ చేస్తారో గమనించి, సరిగ్గా వాళ్ల బలహీనతపై దెబ్బకొట్టింది. రూ.10కే గాళ్ ఫ్రెండ్ అంటూ ప్రకటన ఇచ్చింది. షాపింగ్ మాల్ కు వచ్చినవాళ్లు రూ.10 చెల్లిస్తే చాలు... అందమైన అమ్మాయి షాపింగ్ లో మీకు తోడుగా ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో ఓ షరతు కూడా ఉంది. పది రూపాయలు చెల్లిస్తే అమ్మాయి కేవలం 20 నిమిషాలే మనతో పాటు ఉంటుందట. ఆ తర్వాత మరో పది రూపాయలు చెల్లిస్తే మరో అమ్మాయి రెడీ! ఈ వినూత్నమైన ఆఫర్ తో షాపింగ్ మాల్ కు వచ్చే యువకుల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు.