Narendra Modi: సీఏఏపై నిరసనల వెనుక కుట్ర ఉంది: ప్రధాని మోదీ

  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ
  • విద్వేష రాజకీయాలతో దేశం ముందుకు వెళ్లదు
  •  బీజేపీకి దేశ ప్రయోజనాలే ముఖ్యం

జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని సీలంపూర్, జామియా యూనివర్శిటీ, షాహీన్ బాగ్ ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనల వెనుక కుట్ర ఉందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, కుట్ర పూరిత రాజకీయాల్లో భాగంగానే ఇవి జరుగుతున్నాయని, విద్వేష రాజకీయాలతో దేశం ముందుకు వెళ్లదని అన్నారు. బీజేపీకి దేశ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. 2022 నాటికి పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆప్ కు మరోమారు అవకాశం కల్పిస్తే సంక్షేమ పథకాలను ఆపివేస్తుందని విమర్శించారు.

More Telugu News