Corona Virus: కరోనా భయాలన్నీ పక్కనబెట్టి ఒక్కటైన చైనా అమ్మాయి, భారత్ అబ్బాయి

  • మందసౌర్ లో మధ్యప్రదేశ్ అబ్బాయితో చైనా అమ్మాయి వివాహం
  • అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు చైనా నుంచి రాక
  • వెంటనే వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన మధ్యప్రదేశ్ వైద్య సిబ్బంది

చైనా వాళ్లంటే ప్రపంచమంతా హడలిపోయే పరిస్థితి వచ్చింది. అందుకు కారణం కరోనా వైరస్. సాధారణ జలుబు, దగ్గులా ప్రారంభమయ్యే ఈ వైరస్ లక్షణాలు కొద్ది వ్యవధిలోనే ముదిరి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అందుకే ప్రపంచ దేశాలు చైనీయులను అంత తేలిగ్గా తమదేశంలో అడుగు పెట్టనివ్వడంలేదు. అనేక రకాల పరీక్షలు చేశాకే ఓకే చెబుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా ఓ చైనా అమ్మాయి, ఓ భారత యువకుడు కరోనా వైరస్ భయాలను పట్టించుకోకుండా భేషుగ్గా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం మధ్యప్రదేశ్ లోని మందసౌర్ లో జరిగింది.

మధ్యప్రదేశ్ కు చెందిన సత్యార్థ్ మిశ్రా, చైనా అమ్మాయి ఝిహావో వాంగ్ షెరిడాన్ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు. వాళ్ల ప్రేమకు పెద్దల ఆశీస్సులు తోడవడంతో పెళ్లితో ఒక్కటవ్వాలని నిశ్చయించుకున్నారు. అయితే, పెళ్లికోసం చైనా అమ్మాయి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మందసౌర్ రావడంతో స్థానిక వైద్యఆరోగ్య సిబ్బంది హడలిపోయారు. వారిలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే పరిస్థితి ఏంటని భయపడ్డారు. దాంతో చైనా అమ్మాయి తరఫు వాళ్లందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి ఇబ్బందేమీ లేదని తెలుసుకున్నాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News