Hyderabad: మైక్రోస్కోప్‌ ఆవిష్కరణతో అపోహలకు చెక్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

  • ఆసియా పసిఫిక్‌ మైక్రోస్కోపీ సదస్సును ప్రారంభించిన గవర్నర్‌
  • ఆధునిక పరికరాలతో సునిశిత పరిశోధన, పరిశీలన సాధ్యం
  • తయారీ, వినియోగం పెంచాలని సూచన

మూఢనమ్మకాలతో భయాందోళనలకు గురయ్యే ప్రజల ఇబ్బందులకు మైక్రోస్కోప్‌ ఆవిష్కరణతో చెక్‌ పడిందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. వ్యాధి నిర్థారణకు అవసరమైన సునిశిత పరిశీలన, పరిశోధనలకు ఇవి ఎంతో దోహదపడడమే ఇందుకు కారణమని చెప్పారు. హైదరాబాద్‌ లోని మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో 12వ ఆసియా పసిఫిక్‌ మైక్రోస్కోపీ సదస్సును గవర్నర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశీయంగా మైక్రోస్కోపీ తయారీ పెరగాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కంటికి కనిపించని వైరస్‌, బ్యాక్టీరియాను గుర్తించే శక్తి మైక్రోస్కోపిస్టులదేనన్నారు. మైక్రోస్కోపీ సాంకేతికతతో ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. 

More Telugu News