Amaravati: ‘జై అమరావతి’ అన్న విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

  • రెండు రోజుల క్రితం జేఏసీ ఆందోళనలో నినాదాలు
  • నలుగురు విద్యార్థులపై చర్యలు తీసుకున్న నాగార్జున వర్సిటీ పాలకులు
  • వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో నిర్ణయం

అమరావతి పరిరక్షణ కోసం ఏర్పడి అఖిల పక్ష సమావేశం ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం జరిగిన ఆందోళనలో  ‘జై అమరావతి’ అన్న విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్న నలుగురు విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో విశ్వవిద్యాలయం అధికారులు వీరిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అయితే పలు వర్గాల నుంచి దీనిపై విమర్శలు రావడం, ఒత్తిడి పెరగడంతో ఈరోజు సస్పెన్షన్‌ ఎత్తివేశారు. మరోవైపు యూనివర్సిటీ ఉపకులపతి రాజీనామా చేయాలంటూ విద్యార్థులు ఈ రోజు అమరావతి పరిరక్షణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో  ధర్నాకు దిగారు. దీంతో వర్సిటీ ప్రాంగణంలో భారీగా పోలీసులు మోహరించారు.

More Telugu News