Akhil Akkineni: అఖిల్ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

  • మరో ఫ్యామిలీ లవ్ స్టోరీతో 'బొమ్మరిల్లు' భాస్కర్ 
  • పరిశీలనలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి 

అఖిల్ తాజా చిత్రానికి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ప్రేమకథా చిత్రం ఇది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి వుంది.

ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. రేపు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు టైటిల్ ను రివీల్ చేయనున్నారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనీ, దాదాపు ఇదే టైటిల్ ఖరారు చేయవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందని అంటున్నారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో అఖిల్ వున్నాడు. ఆయన అభిమానులు కూడా అదే అభిప్రాయంతో వున్నారు.

More Telugu News