Crime News: పశ్చిమ బెంగాల్‌లో.. ఉపాధ్యాయురాలిని తాళ్లతో కట్టేసి కొడుతూ వేధింపులు

  • రోడ్డు పనుల్లో భాగంగా బలవంతంగా భూమి లాక్కోవాలని చూసిన వైనం
  • అడ్డుకున్నందుకు దాడి
  • నిందితుల్లో టీఎంసీ నేత అమల్ సర్కార్‌?

పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిని కొందరు తాళ్లతో కట్టేసి, కొడుతూ వేధించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లా గంగ్రామ్‌పూర్‌లో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆ ఉపాధ్యాయురాలి భూమిని బలవంతంగా సేకరించాలని కొందరు భావించారు. అయితే, అందుకు ఆమె నిరసన తెలపడంతో కొందరు ఆమెపై దాడికి పాల్పడ్డారు.

నిందితుల్లో టీఎంసీ నేత అమల్ సర్కార్‌ కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆమె కాళ్లను తాడుతో కట్టేసి, లాక్కెళుతూ కొడుతూ దాడి చేశారు. ఈ ఘటనతో అమల్ సర్కార్‌ను టీఎంసీ అధిష్ఠానం తమ పార్టీ నుంచి తొలగించింది. ఈ ఘటనపై ఆ ఉపాధ్యాయురాలు ఐదుగురిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News