Brahmanandam: విశాఖలో మహారథయాత్ర.. హాస్యనటుడు బ్రహ్మానందంకు ఘన సత్కారం

  • బ్రహ్మానందం సినీ ప్రస్థానానికి ముప్పై ఐదేళ్లు
  • విశాఖ రైటర్స్ అకాడమీ నేతృత్వంలో సత్కారం
  • గుర్రపు బగ్గీపై ఊరేగిన బ్రహ్మానందం

విశాఖలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు ఘనసత్కారం జరిగింది. బ్రహ్మానందం సినీ ప్రస్థానం ప్రారంభించి ముప్పై ఐదేళ్లు పూర్తయింది, ఈ సందర్భంగా విశాఖ రైటర్స్ అకాడమీ నేతృత్వంలో బ్రహ్మానందాన్ని ఘనంగా సత్కరించారు. స్థానిక గురజాడ కళాక్షేత్రం వేదికగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ నేవీ విజయ స్థూపం నుంచి గురజాడ కళాక్షేత్రం వరకు మహా రథయాత్ర నిర్వహించారు. గుర్రపు బగ్గీపై బ్రహ్మానందాన్ని ఊరేగిస్తూ వేదిక ప్రాంగణం వరకు తీసుకువచ్చారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు పలువురు పాల్గొన్నారు.

More Telugu News