Stalin: డీఎంకే వ్యూహాలు రూపొందించే బాధ్యతలు ప్రశాంత్ కిశోర్ కు అప్పగింత!

  • త్వరలో తమిళనాడులో ఎన్నికలు
  • పీకేను వ్యూహకర్తగా నియమించిన స్టాలిన్
  • ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాల రూపకల్పనలో మేటి అని పీకేకి పేరు

బీహార్ కు చెందిన ప్రశాంత్ కిశోర్ కు ఎన్నికల వ్యూహకర్తగా ఎంతో పేరుంది. ఏపీలో ఇటీవల వైసీపీ విజయ ప్రస్థానంలో ఆయన పాత్ర తీసివేయలేనిది. తాజాగా ప్రశాంత్ కిశోర్ సేవలు అందుకోవాలని డీఎంకే అధినేత స్టాలిన్ భావిస్తున్నారు. పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రజలను ఆకట్టుకునేలా ప్రణాళికలు రచించడంతో పాటు ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలను రూపొందించాలని డీఎంకే యోచిస్తోంది. అందుకే ఉత్తరాది నుంచి పీకేను రప్పిస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో రజనీకాంత్, కమల్ హాసన్ ల ప్రభావం గణనీయంగా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో ఓట్లు చీలకుండా ఉండేలా వ్యూహాలు రూపొందించేందుకు ప్రశాంత్ కిశోర్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన గతంలో బీజేపీ అగ్రనేతలకు సైతం వ్యూహకర్తగా పనిచేశారు.

More Telugu News