Vijay Devarakonda: ఓ చిన్న పట్టణానికి చెందిన వరల్డ్ నెం.1 లవ్ స్టోరీ... ట్రైలర్ వస్తోంది: విజయ్ దేవరకొండ

  • విజయ్ దేవరకొండ హీరోగా వరల్డ్ ఫేమస్ లవ్ స్టోరీ
  • ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్
  • ఫిబ్రవరి 6న ట్రైలర్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ యూత్ ఫుల్ మూవీ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజవుతోంది. కాగా, ఈ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 6న వస్తోంది. ఈ విషయాన్ని హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో వెల్లడించారు.

ఓ చిన్న పట్టణానికి చెందిన వరల్డ్ నెం.1 లవ్ స్టోరీ ఈ చిత్ర కథాంశం అని తెలిపారు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోందని, ట్రైలర్ ఫిబ్రవరి 6న సాయంత్రం 4.05 గంటలకు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, క్యాథరిన్ ట్రెసా, ఇజబెల్లా లీట్ నటిస్తున్నారు.

More Telugu News