Corona Virus: వుహాన్ నుంచి భారత్ చేరుకున్న రెండో విమానం : మరో 323 మంది రాక

  • వీరిలో ఏడుగురు మాల్దీవ్ ల వాసులు 
  • నిన్న తొలి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరిన 324 మంది 
  • అందరికీ వైద్య పరీక్షలు నిర్వహణ

చైనాను కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను రప్పించే పని చురుకుగా సాగుతోంది. మొత్తం 323 మంది ప్రయాణికులతో ఉన్న రెండో ప్రత్యేక విమానం ఈరోజు ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ చేరింది. వూహాన్లో తెల్లవారు జామున 3.10 గంటలకు ఈ విమానం బయలుదేరింది. వచ్చిన వారిలో ఏడుగురు మాల్దీవ్ ల నివాసితులు ఉన్నారని చైనాలోని భారత్ రాయబారి విక్రమ్ మిస్త్రీ ట్వీట్ చేశారు. నిన్న తొలి ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్న 324 మందికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి పరిశీలనలో ఉంచారు.

ఇప్పుడు వచ్చిన వారికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. చైనాలో పరిస్థితి, కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరును చూసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆరోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్ ఏమెర్జెన్సీ) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చైనాలో చదువుతున్న, సందర్శనకు వెళ్లిన వారిని రప్పించేందుకు భారత్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.

More Telugu News