Tirumala: భక్తులతో నిండిపోయిన తిరుమల... అద్దె గదులు దొరకక ఇబ్బందులు!

  • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
  • సర్వదర్శనానికి 12 గంటల సమయం
  • నిన్న రికార్డు స్థాయిలో 96 వేల మందికి పైగా దర్శనం

దేవదేవుడు కొలువైన తిరుమల గిరులు, భక్త జనులతో కిక్కిరిసిపోయాయి. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు, దివ్యదర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు దర్శనానికి 3 గంటల వరకూ సమయం పడుతోందని తెలిపారు. శనివారం నాడు రికార్డు స్థాయిలో 96,326 మంది భక్తులు దర్శించుకున్నారు. వారాంతం కావడంతో రద్దీ గణనీయంగా పెరిగిందని అధికారులు అంచనా వేశారు. దర్శనం కోసం వేచి చూస్తున్న వారికి క్యూలైన్లలో అన్న పానీయాలను నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. కాగా, స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు అద్దె గదులు లభించని పరిస్థితి నెలకొంది. దీంతో ఆరుబయట షెడ్లలోనే చలిలో భక్తులు పడిగాపులు పడుతున్నారు.

More Telugu News