Pawan Kalyan: మెగా ఫ్యాన్స్ కు పండగే... పవన్ కల్యాణ్ సినిమాలో రేణూ దేశాయ్?

  • 'పింక్' రీమేక్ స్టార్ట్ చేసిన పవన్
  • ఓ పిల్లాడి తండ్రి పాత్రలో రేణూ
  • గతంలో రెండు సినిమాల్లో నటించిన జంట

సుదీర్ఘ విరామం తరువాత పవన్ కల్యాణ్ నటిస్తున్న 'పింక్' రీమేక్ చిత్రంలో ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా నటించనున్నారట. టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమైతే, మెగా ఫ్యాన్స్ కు పండగే. గతంలో 'బద్రి', 'జానీ' చిత్రాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారన్న సంగతి తెలిసిందే.

తాజాగా పింక్ రీమేక్ లో, ఓ కీలకమైన పాత్రను రేణూ పోషించనున్నారని సమాచారం. సినిమాలో ఓ పిల్లవాడి తల్లి పాత్రలో ఆమె కనిపిస్తారని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్, రేణూను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా, ఎన్నో ఏళ్ల తరువాత పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ కలిసి ఓ సినిమాలో నటిస్తే, ఫ్యాన్స్ పండగ చేసుకుంటారనడంలో సందేహం ఏముంది?

More Telugu News