19 Toes-12 Fingers: 19 కాలివేళ్లు.. 12 చేతివేళ్లతో.. భారత మహిళ ప్రపంచ రికార్డుల్లోకి!

  • గిన్నిస్ బుక్ లోకి ఒడిశాకు చెందిన కుమారి 
  • గతంలో 14 కాలివేళ్లు, 14 చేతివేళ్లతో దేవేంద్రా పేర రికార్డు
  • పోలిడాక్టిలిజమ్ అనే సిండ్రోమ్ వల్లే ఈ అదనపు వేళ్లు

భారత్ కు చెందిన ఓ మహిళకు అసాధారణ రీతిలో పెరిగిన చేతి వేళ్లు, కాలి వేళ్లతో జన్మించినప్పటికీ.. ఆ అదనపు వేళ్లే ఆ మహిళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి పెట్టాయి. గతంలో ఈ రికార్డు భారత్ లోని గుజరాత్ కు చెందిన దేవేంద్రా సుథార్(47), పేర ఉండేది. ఇతనికి 14 కాలివేళ్లు, 14 చేతివేళ్లు ఉన్నాయి. తాజాగా ఈ రికార్డు 63 ఏళ్ల కుమారి కొట్టేసి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది.ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లాలోని కడపడ గ్రామానికి చెందిన కుమారి పుట్టుకతో అదనపు వేళ్లతో జన్మించింది. తల్లి కడుపులోనే ఉన్న సమయంలో పిండం పోలిడాక్టిలిజమ్ అనే సిండ్రోమ్ కు లోను కావడంవల్ల ఆమెకు ఈ అదనపు వేళ్లు వచ్చాయని వైద్యులు తేల్చారు. దీన్ని శస్త్ర చికిత్స ద్వారా సరిచేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే, మారుమూల ప్రాంతంలో పేద కుటుంబంలో జన్మించిన ఈ మహిళ అదనపు వేళ్లతోనే 63 ఏళ్లు గడిపేసింది.

గ్రామస్థులు తనను మంత్రగత్తెగా భావించడంతో బయట తిరగలేకపోతున్నానని చెప్పింది. తాను ఎక్కువ కాలం ఇంట్లోనే గడుపుతున్నట్లు కుమారి వెల్లడించింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా బయటపెట్టడంతో విషయం గిన్నిస్ రికార్డుల దాకా వెళ్లిందని తెలుస్తోంది.

More Telugu News