La Nagar police: ‘హెల్మెట్’ పై వినూత్న రీతిలో అవగాహన కల్పించిన ఎల్బీనగర్ పోలీసులు

  • కొనసాగుతున్న 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలు
  • వాహనచోదకుడు, వెనుక వ్యక్తి హెల్మెట్లు ధరిస్తూ ఆఫర్
  • ఉచితంగా ఒక లీటర్ పెట్రోల్ కూపన్లు

హెల్మెట్ ధరించడంపై వాహనచోదకులకు, వారితో ప్రయాణించే వారికి అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. 31వ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వాహనచోదకుడు సహా వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్లు ధరించి ప్రయాణిస్తే మంచి ఆఫర్ ను ఎల్బీనగర్ పోలీసులు ప్రకటించారు. పోలీసులు తమ సొంత ఖర్చుతో ఒక లీటర్ పెట్రోల్ కూపన్లు ఉచితంగా అందజేశారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా ఏఎస్ఐ అంజపల్లి నాగమల్లు మాట్లాడుతూ, ప్రతి ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందులో లక్షా యాభై వేల మంది వరకు చనిపోతున్నారని చెప్పారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అధిక శాతం మంది మృతి చెందుతున్నారని అన్నారు. దీనిని అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఈ తరహా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వాహనచోదకులకు వివరించినట్టు చెప్పారు.

More Telugu News