Arvind Kejriwal: మోదీ మా ప్రధాని.. ఆయనపై విమర్శలు సహించం: పాక్ మంత్రికి కేజ్రీవాల్ హెచ్చరిక

  • పాక్ మంత్రి ఫవాద్ వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఆగ్రహం
  • ఢిల్లీ ఎన్నికలు మా అంతర్గత విషయం
  • మోదీ నాకూ ప్రధానే అన్న కేజ్రీవాల్

రాజకీయాలు దేశభక్తికి అడ్డురావని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చాటారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై పాకిస్థాన్ మంత్రి ఫవాద్ చౌదరి భారత ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫవాద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. 'ఢిల్లీ ఎన్నికలు భారత్ అంతర్గత విషయం. మోదీ మా ప్రధానమంత్రి. ఆయనపై విమర్శలను మేము సహించం' అన్నారు.

‘నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి. ఆయన నా ప్రధానమంత్రి కూడా. ఢిల్లీ ఎన్నికలు భారత అంతర్గత విషయం. ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరంగా పేరుపొందిన పాకిస్థాన్ జోక్యం మేము సహించం’ అని అన్నారు.

ఇటీవల పాక్ మంత్రి ఫవాద్ ట్విట్టర్ వేదికగా ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ.. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా మోదీకి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. కశ్మీర్, పౌరసత్వ చట్టాలు, ఆర్థిక సమస్యల మూలంగా ఇటు దేశంలో అటు  ప్రపంచ దేశాలనుంచి వస్తోన్న విమర్శల మూలంగా మోదీ మతి చలించిందంటూ.. అర్థంలేని వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. దీనిపైనే కేజ్రీవాల్ మండిపడ్డారు.

More Telugu News