Telangana Olympic Association: తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికల నిర్వహణపై కోర్టులో విచారణ వాయిదా

  • అధ్యక్ష పదవికి జయేష్ రంజన్, జితేందర్ రెడ్డి పోటీ
  • ఫిబ్రవరి 9న ఎన్నికలు
  • ఎన్నికలు ఢిల్లీలో జరపాలని తీర్మానం
  • తెలంగాణలోనే జరపాలంటూ కోర్టును ఆశ్రయించిన జయేష్ ప్యానెల్
  • విచారణ సోమవారానికి వాయిదా

తెలంగాణ ఒలింపిక్ సంఘం ఎన్నికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. పేరుకు క్రీడాసంఘం ఎన్నికలైనా, రాజకీయ ఛాయలు కనిపిస్తుండడంతో పోటీ రంజుగా తయారైంది. తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. కార్యదర్శి పదవి కోసం అరిసనపల్లి జగన్ మోహన్ రావు, జగదీశ్ యాదవ్ బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. ఎన్నికలు ఢిల్లీలో జరపాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. అయితే తెలంగాణలోనే ఎన్నికలు నిర్వహించాలని జయేష్ రంజన్ ప్యానెల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది.

More Telugu News