Hyderabad: ఓఆర్ఆర్ చుట్టూ మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయి: మంత్రి కేటీఆర్

  • క్రెడాయ్ ప్రాపర్టీ షో-2020ను ప్రారంభించిన కేటీఆర్
  • హైదరాబాద్ లో మరో 15 ఏళ్ల పాటు ఇదే వేగంతో వృద్ధి  
  • వారం రోజుల్లో మరో ‘మెట్రో’ కారిడార్  

ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ మరిన్ని పరిశ్రమలు రాబోతున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో-2020 ను ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో మరో పదిహేనేళ్ల పాటు ఇదే వేగంతో వృద్ధి కొనసాగుతుందని అన్నారు. హైదరాబాద్ లో శుద్ధి చేసిన నీటిని మాత్రమే భవన నిర్మాణంలో ఉపయోగించాలని ఆదేశించారు.

మౌలిక వసతుల కల్పన నిమిత్తం వారం రోజుల్లో మరో ‘మెట్రో’ కారిడార్ ప్రారంభించబోతున్నామని, మెట్రోలైన్ ను నాగోల్ నుంచి శంషాబాద్ వరకు విస్తరిస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రధాన రోడ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తామని, పార్కింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త పాలసీని తీసుకొస్తామని, ఫార్మా సిటీని కూడా ఈ ఏడాదే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

More Telugu News