Ex MP Harshkumar: ఏ తప్పు చేయకున్నా జైల్లో పెట్టారు... అయినా గర్వపడుతున్నా: మాజీ ఎంపీ హర్షకుమార్

  • రాజధాని పేరుతో విశాఖను పాడుచేయవద్దు
  • బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్ వేశాను
  • ప్రభుత్వాధికారులను దూషించలేదు

తాను ఏ తప్పూ చేయకున్నప్పటికీ తనను జైలులో పెట్టినందుకు గర్వపడుతున్నానని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. డిసెంబర్ 13న అరెస్టయి రిమాండ్ మేరకు జైలులో ఉన్న ఆయన ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్ వేశానన్నారు. బోటు ప్రమాదంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  తాను ప్రభుత్వ అధికారులను దూషించలేదన్నారు. 28 రోజుల వరకు పోలీసులు తనకు రిమాండ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిగా విశాఖను ప్రకటించడాన్ని హర్షకుమార్ తప్పుబట్టారు. రాజధాని పేరుతో విశాఖను పాడుచేయవద్దని అన్నారు. స్వరూపానంద శిష్యుడు కావడంవల్లే మంత్రి అవంతి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News