Telangana: మెడికల్ కాలేజీల ఫీజుల వ్యవహారం: తెలంగాణ ప్రభుత్వం, కాళోజీ వర్సిటీకి సుప్రీంకోర్టు నోటీసులు

  • సుప్రీంను చేరిన మెడికల్ ఫీజుల వ్యవహారం
  • నాలుగున్నరేళ్లకే ఫీజలు వసూలు చేయాలన్న హైకోర్టు
  • సుప్రీంను ఆశ్రయించిన మెడికల్ అండ్ డెంటల్ కాలేజీల సంఘం

మెడికల్ కళాశాలల ఫీజు వసూళ్ల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, కాళోజీ వర్సిటీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మెడికల్ కాలేజీల్లో నాలుగున్నరేళ్లు మాత్రమే ఫీజులు వసూలు చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.  

కొన్నిరోజుల కిందటే మెడికల్ ఫీజుల వసూలు విధానాన్ని తప్పుబడుతూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎంబీబీఎస్ కోర్సు నాలుగున్నరేళ్లు అయితే ఐదేళ్లకు ఫీజులు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించింది. అంతేకాదు, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ విద్యార్థుల పక్షాన కాకుండా ప్రైవేటు వైద్య కళాశాలల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీ అసోసియేషన్ సుప్రీంను ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది.

More Telugu News