థ్యాంక్యూ సూపర్ స్టార్... తండ్రి వ్యాఖ్యలకు స్పందించిన మహేశ్ బాబు

31-01-2020 Fri 14:12
  • సరిలేరు నీకెవ్వరు అంటూ తండ్రినుద్దేశించి ట్వీట్
  • కృష్ణ వ్యాఖ్యలకు సంతోషం పట్టలేక ట్వీట్ చేసిన మహేశ్ బాబు
  • ఈ వ్యాఖ్యలు చాలు ఇంకేమీ అక్కర్లేదంటూ వెల్లడి

'సరిలేరు నీకెవ్వరు' చిత్రంపై సూపర్ స్టార్ కృష్ణ తన అభిప్రాయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను దర్శకుడు, నిర్మాత 'బ్లాక్ బస్టర్ కా బాప్' అని అభివర్ణించడం సరైనదేనని కృష్ణ ఓ వీడియోలో అభిప్రాయపడ్డారు. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి మరిన్ని రోజులు ఆడే సత్తా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై మహేశ్ బాబు స్పందించారు. "థ్యాంక్యూ మై సూపర్ స్టార్... సరిలేరు మీకెవ్వరు" అంటూ ట్వీట్ చేశారు. ఎన్ని పొగడ్తలు, ఎన్ని ప్రశంసలు కూడా ఈ వ్యాఖ్యల ముందు దిగదుడుపేనని, ఈ వ్యాఖ్యలు చాలు ఇంకేమీ అక్కర్లేదని తండ్రి చేసిన వ్యాఖ్యల పట్ల సంతోషంతో పొంగిపోయారు.