Nirbhaya: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో మరో ట్విస్టు

  • ఉరిశిక్షను వాయిదా వేయాలని పిటిషన్‌ 
  • పిటిషన్‌ను రిజర్వులో పెడుతున్నట్లు కోర్టు ప్రకటన
  • ఈ రోజే మరోసారి విచారణ చేపట్టే అవకాశం?

'నిర్భయ' కేసులో దోషులను రేపు తిహార్‌ జైల్లో ఉరి తీయడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటోన్న నేపథ్యంలో మరో ట్విస్ట్ ఎదురైంది. ఉరిశిక్షను వాయిదా వేయాలని  దోషుల తరఫు లాయర్‌ ఏపీ సింగ్‌ ఢిల్లీ హైకోర్టును కోరారు. నిర్భయ దోషి వినయ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం మరో దోషి ముకేశ్‌కు మాదిరిగానే ఇతడికి కూడా 14 రోజుల గడువివ్వాలని అన్నారు. దీంతో ఈ పిటిషన్‌ను రిజర్వులో పెడుతున్నట్లు కోర్టు ప్రకటించింది. దీనిపై ఈ రోజే మరోసారి విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మిగతా ముగ్గురు దోషులను ఉరితీసేందుకు అభ్యంతరం లేదని కోర్టు చెప్పినట్లు సమాచారం.

More Telugu News