Rakesh Mishra: కరోనా చాలా వేగంగా విస్తరిస్తుంది: సీసీఎంబీ హెచ్చరిక

  • ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్
  • తగు చర్యలు తీసుకుంటే ఆందోళన అవసరం లేదు
  •  సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్, చాలా వేగంగా వ్యాపిస్తుందని హైదరాబాద్ కు చెందిన సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, సార్స్ వైరస్ కుటుంబం నుంచే కరోనా కూడా వృద్ధి చెందిందని అన్నారు.

ఇతర ఇన్ ఫెక్షన్ల మాదిరిదే ఇది కూడా అని, సాధారణంగా వచ్చే జ్వరంతో పాటు, ముక్కు కారుతూ ఉండటం, దగ్గు కరోనా లక్షణాలని తెలిపారు. వైరస్ ఆర్ఎన్ఏలో మార్పు లేదని, రక్త నమూనాలు సేకరించి, పరీక్షలు జరపడం ద్వారా, కొన్ని గంటల్లోనే వైరస్ ను నిర్ధారించవచ్చని అన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే, రోగిని ఇతరులతో కలవకుండా, విడిగా ఉంచి, జాగ్రత్తలు తీసుకుంటూ, చికిత్స జరిపిస్తే, ఎటువంటి ఆందోళనా చెందవలసిన అవసరం లేదని రాకేశ్ మిశ్రా తెలిపారు.

More Telugu News