CoronaVirus: చైనాలో పెరుగుతున్న కరోనా మృతులు.. 170 మంది మృతి, 1370 మంది పరిస్థితి విషమం!

  • నిన్న ఒక్కరోజే 38 మంది మృతి
  • వైరస్ బారిన 7700 మంది
  • అక్కడికి వెళ్లొద్దంటూ పౌరులకు పలుదేశాల హెచ్చరికలు 

కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య చైనాలో అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 38 మంది మృతి చెందారు. దీంతో మొత్తంగా ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 170కి పెరిగింది. మరోవైపు, ఇప్పటి వరకు 7,700 మంది ఈ ప్రమాదకర వైరస్ బారిన పడగా, వీరిలో 1370 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

వైరస్ రోజురోజుకు విజృంభిస్తుండడంతో చైనాకు వెళ్లొద్దంటూ భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలు తమ పౌరులకు సూచించాయి. ఇక, వ్యాధి ప్రబలిన వూహాన్‌ నగరంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌కు వచ్చేందుకు అంగీకరించే అందరినీ స్వదేశానికి పంపిస్తున్నట్టు బీజింగ్‌లోని భారత ఎంబసీ తెలిపింది. మరోవైపు, వైరస్ కారణంగా చైనాలో ఆహార ఉత్పత్తుల సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.

More Telugu News