విభజన చట్టంలోని సమస్యాత్మక అంశాలపై తెలుగు రాష్ట్రాల సీఎస్ ల భేటీ

30-01-2020 Thu 19:32
  • హైదరాబాద్ బీఆర్ కే భవన్ లో సమావేశం
  • హాజరైన సోమేశ్ కుమార్, నీలం సహానీ
  • 10 ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అంశాలపై చర్చ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అనంతరం ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎస్ లు సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని బీఆర్ కే భవన్ లో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, ఏపీ సీఎస్ నీలం సహానీ, ఇతర నిపుణులు హాజరయ్యారు.

10 ప్రభుత్వ సంస్థలకు సంబంధించి విభజన చట్టంలో సమస్యాత్మకంగా ఉన్న అంశాలపై వారు చర్చించారు. దీనిపై చర్చించాలని గతంలో సీఎం కేసీఆర్, సీఎం జగన్ నిర్ణయించగా, అందుకు కొనసాగింపుగా సీఎస్ లు సమావేశమయ్యారు. ఈ చర్చలు సామరస్య పూర్వక వాతావరణంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. ముందుముందు ఇలాంటివే మరికొన్ని సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు.