Keshineni Nani: మండలి రద్దు తీర్మానం నేరుగా పార్లమెంటులోకి వెళితే.. బీజేపీ-వైసీపీ కుమ్మక్కయినట్టే: కేశినేని నాని

  • ఇదే జరిగితే..బీజేపీకి వైసీపీ బీ టీమ్ అవుతుంది
  • సంప్రదాయం ప్రకారం బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలించాలి
  • కమిటీ వద్ద ఇప్పటికే 10 రాష్ట్రాల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి రద్దుకు సంబంధించిన తీర్మానం నేరుగా పార్లమెంట్ లోకి వెళితే బీజేపీ-వైసీపీ ఈ విషయంలో కుమ్మక్కయినట్లేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇదే జరిగితే.. బీజేపీకి వైసీపీ బీ టీమ్ అని భావిస్తామని ఆయన చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మండలి రద్దు తీర్మానాన్ని ముందుగా స్టాండింగ్ కమిటీ (స్థాయీ సంఘం) పరిశీలిస్తుందన్నారు. ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ వద్ద 10 రాష్ట్రాలకు చెందిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

కేంద్రం సంప్రదాయం ప్రకారం చూస్తే కనుక, ఓ బిల్లు నేరుగా చట్ట సభలకు వెళ్లకపోవచ్చన్నారు. స్టాండింగ్ కమిటీ పరిశీలన తర్వాతే అది చట్ట సభల్లో ప్రవేశపెడతారన్నారు. ‘రాజధాని తరలింపు’ అంశం అంగుళం కూడా ముందుకు కదలలేదని కేశినేని వ్యాఖ్యానించారు. మండలి రద్దుపై సీఎం జగన్ వైఖరిని ఢిల్లీలో లేవనెత్తుతామని చెప్పారు. దీనిపై ప్రధాని మోదీని కూడా కలుస్తామన్నారు.

More Telugu News