MIM: మజ్లిస్ పార్టీతో బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉంది: ఉత్తమ్

  • టీఆర్ఎస్ కూడా ఆ రెండింటితో చెలిమి చేస్తోందని ఆరోపణ
  • మత రాజకీయాలు చేస్తున్నాయంటూ మండిపాటు
  • మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందంటూ బీజేపీపై ధ్వజం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ, మజ్లిస్, టీఆర్ఎస్ లపై ధ్వజమెత్తారు. మజ్లిస్ పార్టీతో బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని, టీఆర్ఎస్ సైతం బీజేపీ, మజ్లిస్ తో మైత్రి కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు గాంధీ సిద్ధాంతాలను పట్టించుకోకుండా మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

ముఖ్యంగా బీజేపీ గాంధీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం మహాత్ముడి సిద్ధాంతాలే ఊపిరిగా ముందుకు సాగుతోందని, దేశంలో పరమత సహనం ఉండాలన్న గాంధీ అభిమతాన్ని పాటిస్తోంది కాంగ్రెస్ మాత్రమేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు. జాతిపిత వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్ లో నివాళులు అర్పించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News