China: చైనాలో ఉన్న తెలుగు ఇంజినీర్లను స్వదేశం తీసుకురావాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ

  • చైనాలోని వుహాన్ నగరంలో చిక్కుకుపోయిన తెలుగు ఇంజినీర్లు
  • విదేశాంగ మంత్రికి లేఖ రూపంలో చంద్రబాబు విజ్ఞప్తి
  • బాధితుల కుటుంబాల తరఫున కోరుతున్నానని వెల్లడి

చైనాలో కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన 58 మంది తెలుగు ఇంజినీర్ల పరిస్థితిపై తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కరోనా వైరస్ వ్యాప్తిలో ఉన్న చైనాలోని వుహాన్ నగరంలో తెలుగు ఇంజినీర్లు చిక్కుకుపోయారని, వారిని వీలైనంత త్వరగా స్వదేశం తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు రాసిన లేఖలో కోరారు.

"ఇటీవలే మీరు 20 మంది తెలుగు మత్స్యకారులను పాకిస్థాన్ నుంచి సురక్షితంగా తీసుకువచ్చారు. తెలుగు ప్రజలు మీ సేవలను సదా గుర్తుంచుకుంటారు.  ఇప్పుడు కూడా 58 మంది ట్రైనీ ఇంజినీర్లను సురక్షితంగా తీసుకురావాలని వారి కుటుంబాల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ తన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News