Nirbhaya: నిర్భయ దోషి అక్షయ్ సింగ్ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

  • నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి
  • సుప్రీంను ఆశ్రయించిన అక్షయ్ కుమార్ సింగ్
  • శిక్ష నుంచి తప్పించుకునేందుకు క్యురేటివ్ పిటిషన్ దాఖలు

నిర్భయ దోషి అక్షయ్ కుమార్ సింగ్ కు సుప్రీం కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. నిర్భయ కేసులో ఉరి శిక్షను సవాల్ చేస్తూ అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటికే ఇతర దోషులు ముఖేశ్, వినయ్ శర్మలకు కూడా ఇదే విషయంలో సుప్రీం నుంచి చేదు ఫలితం వచ్చింది. కొన్నిరోజుల కిందట వారిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లను కూడా సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. అటు, వినయ్ శర్మ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నిర్భయ దోషులు నలుగురికీ ఫిబ్రవరి 1న ఉరి అమలు చేయాల్సి ఉండగా, వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ కారణంగా వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు.

More Telugu News