exersises: అతి అనర్థమే... పోషకాహారం తీసుకోకుండా వ్యాయామం చేస్తే ప్రమాదం!

  • కండలు పెంచేద్దామనుకుంటే సరికాదు 
  • అదే సమయంలో పోషకాహారం తీసుకోవాలి  
  • లేదంటే శరీరంపై ప్రతికూల ప్రభావం

అందమైన శరీర సౌష్టవం కోరుకోని వారు ఎవరుంటారు. స్త్రీపురుషులు అందరిలోనూ ఈ కోరికకు లోటుండదు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్ కి వెళ్లడం, ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవడం, జాగింగ్, వాకింగ్....ఇలా రకరకాలలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అంతవరకు బాగానే ఉన్నా వ్యాయామంతోపాటు పోషకాహారం కూయడ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. 

అలాగే, ఆహారం అంటే ఏదిపడితే అది, ఎంతపడితే అంత, ఎప్పుడు పడితే అప్పుడు తినడం కాదని గుర్తుంచుకోవాలంటున్నారు. శరీరానికి మేలుచేసే పోషకాహారాన్ని నియమిత కాల వ్యవధిలో తీసుకోవడం తప్పనిసరని చెబుతున్నారు. లేదంటే మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మితిమీరిన వ్యాయామం వల్ల ఎముకలు విరగడం, చిన్నవయసులోనే హృద్రోగాల బారిన పడడంతో పాటు, మరణాల ముప్పు ఉంటుందని చెపుతున్నారు. స్వల్ప సమయంలో భారీగా తినడం చేసే వారిలో 'అబ్సెసివ్ కంపల్సివ్ బిహేవియర్' (ఒక పనిని పదేపదే చేసే చాదస్తం) అనే మానసిక సమస్య చుట్టుముడుతుందని బ్రిటన్ లోని ఆంగ్లియా రస్కిన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మైక్ ట్రాల్ తేల్చారు.

 ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో జీవనశైలిని మెరుగుపర్చుకోవడం అసాధారణమేమీ కాకపోయినా వ్యవహార శైలిని అదుపులో ఉంచుకోవడం తప్పనిసరని ఆయన సూచించారు. ఇష్టమున్నా, లేకున్నా కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరం కాకూడదని, తప్పనిసరిగా వాటిని ఆహారంలో భాగంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.

More Telugu News