Nirbhaya: నిర్భయ దోషులకు ఎల్లుండి ఉరి అనుమానమే!

  • ఇప్పటికే జారీ అయిన డెత్ వారెంట్
  • నేడు అక్షయ్ క్యూరేటివ్ పిటిషన్ పై విచారణ
  • ఆపై రాష్ట్రపతి క్షమాభిక్ష కోరే అవకాశం
  • శిక్ష అమలు మరోమారు వాయిదా!

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు మరోమారు వాయిదా పడనుందా? ఇప్పటికే జారీ అయిన డెత్ వారెంట్ ప్రకారం, నలుగురినీ ఎల్లుండి, ఫిబ్రవరి 1న ఉరితీయాల్సి వుండగా, అది అమలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే, ముఖేష్ మినహా మిగతా నిందితులు ఇంకా క్యూరేటివ్ పిటిషన్లను దాఖలు చేసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణం. ముఖేశ్ దాఖలు చేసిన అన్ని పిటిషన్లూ తిరస్కరణకు గురి కావడంతో, అతని ముందున్న న్యాయ మార్గాలన్నీ మూసుకుపోయినట్లే.

ఇదే సమయంలో జైలు నిబంధనల మేరకు, ఒకే కేసులో శిక్ష పడిన నలుగురు నిందితులనూ ఒకేసారి ఉరి తీయాల్సి వుంటుంది. ఈ క్రమంలో అక్షయ్ వేసిన క్యూరేటివ్ పిటిషన్ పై నేడు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కోర్టు దీన్ని తిరస్కరిస్తే, అక్షయ్, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరవచ్చు. రాష్ట్రపతి కూడా నిరాకరిస్తే, తిరిగి రివ్యూ పిటిషన్ ద్వారా న్యాయ సమీక్షను కోరవచ్చు. ఆపై మరో నిందితుడు వినయ్ కూడా ఇదే విధానాన్ని అనుసరించే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ఒకటో తేదీన వీరికి శిక్ష అమలు దాదాపుగా ఉండకపోవచ్చని న్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More Telugu News