Tapsi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • క్రికెటర్ మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీ 
  • పవన్ సినిమాకి 17 కోట్లతో సెట్స్ 
  • హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న అలీ

  *  మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం పేరు 'శభాష్ మిథూ'! రాహుల్ దొలాకియా దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నిన్న విడుదల చేశారు.
*  పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో రూపొందే చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో మొదలైంది. పిరీడ్ డ్రామాగా రూపొందే ఈ చిత్రం కోసం 17  కోట్ల వ్యయంతో సెట్స్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే వీఎఫ్ఎక్స్ కోసం కూడా భారీగా ఖర్చుపెడతారట.  
*  ప్రముఖ హాస్యనటుడు అలీకి బిగ్ ఆఫర్ ఒకటి వచ్చింది. ఇండో-హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం అతన్ని వరించింది. ఈ విషయం గురించి అలీ చెబుతూ, ఈ అవకాశం పట్ల చాలా ఎగ్జయిట్ అవుతున్నానని, ఇది తనకొక మరపురాని అనుభవం అవుతుందని అన్నాడు. మార్టిన్ ఫిలిమ్స్, పింక్ జాగ్వార్ ఎంటర్ టైన్మెంట్స్ కలసి సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి  జగదీశ్ దానేటి దర్శకత్వం వహిస్తారు.   

More Telugu News