CoronaVirus: కరోనా వైరస్ కు మందు కనిపెట్టిన హాంకాంగ్ పరిశోధకులు

  • చైనాలో కోరలు చాచిన కరోనా వైరస్
  • ఇప్పటివరకు 132 మంది మృతి
  • విరుగుడు కనిపెట్టామన్న హాంకాంగ్ పరిశోధకులు
  • జంతువులపై పరీక్షించేందుకు మరికొంత సమయం

ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా చైనా ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటికే అక్కడ మృతుల సంఖ్య 132కి చేరింది. 6 వేల మంది వరకు కరోనా వైరస్ బాధితులు ఉన్నట్టు చైనా ఆరోగ్య శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో, హాంకాంగ్ పరిశోధకులు కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టారు. అయితే, దీన్ని అనేక దశల్లో పరీక్షించాల్సి ఉంది. మొదట జంతువులపై ప్రయోగించి, వచ్చే ఫలితాల ఆధారంగా చివరగా మనుషులపై పరీక్షిస్తారు. జంతువులపై పరీక్షలు నిర్వహించేందుకే నెలల సమయం పడుతుందని, మనుషులపై పరీక్షలకు ఏడాది వరకు ఆగాల్సి ఉంటుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న చైనా వైద్యుడు యువెన్ క్వాక్ యుంగ్ తెలిపారు.

More Telugu News