Junior NTR: మరో ఆసక్తికరమైన ఫొటో పంచుకున్న జూనియర్ ఎన్టీఆర్

  • రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్
  • ఇటీవలే యూనిట్ తో జాయిన్ అయిన అజయ్ దేవగణ్
  • అజయ్ దేవగణ్ కు స్వాగతం పలికిన ఎన్టీఆర్

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా ఆర్ఆర్ఆర్ సెట్స్ పై అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఓ ఆసక్తికరమైన ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అజయ్ దేవగణ్ కు స్వాగతం పలుకుతున్నట్టు పేర్కొన్నారు. "మా ఆర్ఆర్ఆర్ లోకంలోకి అజయ్ దేవగణ్ సార్ కు స్వాగతం పలకడం సంతోషంగా ఉంది" అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లోని ఫొటోలో ఎన్టీఆర్, అజయ్ దేవగణ్ లతో పాటు దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్ కూడా ఉన్నారు.

More Telugu News