Devineni Uma: విశాఖలో రాజధాని అంటే డైరెక్ట్ హిట్టింగ్... గతంలోనే చూశాం!: దేవినేని ఉమ

  • విశాఖను తుపానులు నేరుగా తాకుతాయన్న ఉమ
  • జీఎన్ రావు కమిటీ నివేదికపై ఉమ ప్రెస్ మీట్
  • మంత్రి బొత్సపైనా విసుర్లు

జీఎన్ రావు కమిటీ నివేదికపై పత్రికల్లో వచ్చిన కథనాలపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించడం తెలిసిందే. అటు జీఎన్ రావు కూడా హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. జీఎన్ రావు నివేదికపై బొత్స ఏం మాట్లాడాడో, ఏం చెప్పాడో ఐదు కోట్ల మంది ప్రజలకు ఏమీ అర్థం కాలేదని వ్యంగ్యం ప్రదర్శించారు.

"ఆ తర్వాత మరో గంటకు జీఎన్ రావు రంగంలోకి దిగాడు. ఆయనకు అమరావతి వచ్చే తీరిక లేదేమో హైదరాబాద్ వచ్చి నివేదికపై మాట్లాడాడు. ఓ పావుగంట ఇంగ్లీషులో, ఓ పది నిమిషాలు తెలుగులో చెప్పాడు. ఆయన కూడా పత్రికల్లో వచ్చిన కథనాలను విభేదించలేదు. రాజధానిని ఓ 30 కిలోమీటర్లు అవతల ఏర్పాటు చేసుకోవాలని సూచించారట.

అవతల సముద్రం లేదా? పక్కనే ఉన్న విజయనగరం వద్ద సముద్రం లేదా? శ్రీకాకుళం వద్ద లేదా? విశాఖలో రాజధాని అంటున్నారు... కానీ అక్కడ డైరెక్ట్ హిట్టింగ్ తప్పదు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో తుపాను గాలులు విధ్వంసం సృష్టిస్తాయి. గతంలోనే హుద్ హుద్ ను చూశాం. అక్కడున్న యంత్ర పరికరాలు కూడా దెబ్బతిన్నాయి" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News